పర్పంటేజీ ఇచ్చే సినిమాలే ప్రదర్శిస్తాం.. లేదంటే అసలు వద్దు!!

May 12, 2026 9:22 PM

తెలంగాణ ఎగ్జిబిటర్లకు, ప్రముఖ తెలుగు నిర్మాతలకు మధ్య కొనసాగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. ఎగ్జిబిటర్లు పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయాల్సిందేనని గట్టిగా అల్టిమేటమ్‌ను జారీ చేశారు. ఇది రామ్ చరణ్ కొత్త చిత్రం ‘పెద్ది’ విడుదలపై ప్రభావం చూపవచ్చు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సోదరుడు, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన శిరీష్ రెడ్డి ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, ఎగ్జిబిషన్ రంగంలో పెరుగుతున్న నష్టాల కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైనప్పటి నుండి దాదాపు 100 థియేటర్లు మూతపడ్డాయని తెలిపారు.

ఇతర రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్‌లలో పర్సంటేజీ షేరింగ్ విధానంలో ప్రదర్శించారని, కానీ తెలుగు రాష్ట్రాలలో ఆ అవకాశం దక్కడం లేదని తెలంగాణ ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. ఇండస్ట్రీ బాగుపడాలంటే పర్సంటేజీ షేరింగ్ విధానంలో సింగిల్ స్క్రీన్లు రన్ చేయడం తప్పనిసరని, తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ల మనుగడకు టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతల మద్దతును తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కోరింది. రెంట్/పర్సెంటేజీ సిస్టం సింగిల్ స్క్రీన్లకు ఇకపై ఆచరణ యోగ్యం కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్లను కాపాడేందుకు పూర్తిస్థాయి పర్సంటేజీ షేరింగ్ విధానం అవసరమని తెలిపింది. ప్రస్తుతం సినిమాలు ఎక్కువ రోజులు ప్రదర్శితం కావడం లేదని, ధురంధర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా థియేటర్లలో తక్కువ వారాలే ఆడిందని, మారుతున్న కాలాన్ని బట్టి ప్రేక్షకులలో కూడా మార్పు వచ్చిందని ఎగ్జిబిటర్లు వాపోయారు.

పర్సెంటేజీ విధానంతో మల్టీప్లెక్స్‌లు ఇప్పటికే ప్రయోజనం పొందాయని, పుష్పలాంటి హిట్ చిత్రాలను ఇతర రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్‌లలో పర్సంటేజీ షేరింగ్ విధానంలోనే ప్రదర్శించినట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్‌లకు ఈ అవకాశం దక్కకపోవడం అన్యాయం అవుతుందన్నారు. కొవిడ్‌కు ముందున్న రెంటల్ విధానాన్ని నిర్మాతలు కొనసాగించడం ప్రస్తుతం భారంగా మారిందని పేర్కొంది. పర్సంటేజీ విధానం కొనసాగించడం పరిశ్రమకు అవసరమని తెలిపింది.

తాము థియేటర్లు బంద్ చేస్తున్నామని అసత్య ప్రచారం సాగుతోందని, కానీ అందులో నిజంలేదని, ఎవరైతే పర్సంటేజీ ఇస్తారో వాళ్ల సినిమాలను ప్రదర్శిస్తామని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ స్పష్టం చేశారు. చిత్ర బృందాలు జీవోలు తెచ్చుకున్నప్పటికీ తెచ్చుకున్నప్పటికీ ఇకపై సింగిల్ స్క్రీన్‌లలో టిక్కెట్ ధరలు పెంచబోమని స్పష్టం చేసింది. తాము ప్రేక్షకులు ఈ భరోసా ఇస్తున్నామని హామీ ఇచ్చింది.

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిరీష్ మాట్లాడుతూ, తాము నిర్మించిన చిత్రాలను పర్సంటేజీ షేరింగ్ విధానంలో ప్రదర్శించేందుకు అంగీకరిస్తామని వెల్లడించారు. మేం పర్సంటేజీ గురించి మాట్లాడుతున్నామని, ఎందుకంటే ఇది ఎగ్జిబిటర్ల బతుకు పోరాటామని అన్నారు. ఏ సినిమాను లేదా నిర్మాతను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. థియేటర్లను రక్షించాలని కోరారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media