టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు యువకుడు నితీశ్‌కుమార్ రెడ్డి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అఫ్ఘనిస్థాన్‌తో వన్డే మ్యాచ్ అనంతరం ధర్మశాలలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉండగా తన తల్లి నుంచి ఫోన్ కాల్ రావడంతో, దానికి సమాధానమిచ్చేందుకు సమావేశాన్ని కాసేపు ఆపాడు. నితీశ్‌కుమార్ మీడియా సమావేశంలో పాత్రికేయులు ప్రశ్నలు అడుగుతుండగా ఫోన్ మోగింది. ఫోన్ స్క్రీన్‌పై ‘అమ్మ’ అని చూసిన వెంటనే, నితీశ్ విలేకరులకు క్షమాపణలు చెప్పి కాల్ లిఫ్ట్ చేశాడు. “అమ్మా, నేను మళ్లీ చేస్తాను” అని తెలుగులో చెప్పి ఫోన్ పెట్టేశాడు. అనంతరం చిరునవ్వుతో ప్రెస్ మీట్‌ను కొనసాగించాడు. ఈ కాల్ తప్పకుండా లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది అని నితీష్ చెప్పడం విశేషం.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియో పంచుకుంది. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. తన తల్లికి నితీశ్ ఇస్తున్న గౌరవాన్ని చూసి నెటిజన్లు, క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో నితీశ్‌కుమార్ రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.


