ఓ ప్లంబర్ అకౌంట్ లో రాత్రికి రాత్రి వందల కోట్ల రూపాయలు పడ్డాయి. బీహార్ రాష్ట్రం మస్త్‌పురా గ్రామానికి చెందిన ఓ యువకుడి బ్యాంకు ఖాతాలో 294.80 కోట్ల బ్యాలెన్స్ కనిపించింది. వికాస్ కుమార్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జియో పేమెంట్స్ బ్యాంక్‌లో సుమారు ఐదేళ్లుగా ఖాతా ఉంది. ఇటీవల జియో ఫైనాన్స్ యాప్ ద్వారా తన ఖాతా బ్యాలెన్స్‌ను పరిశీలించిన వికాస్, అందులో 294.80 కోట్ల రూపాయల మొత్తం కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. మొదట్లో ఇది యాప్‌లోని సాంకేతిక లోపమేమోనని భావించగా, మరుసటి రోజు మళ్లీ బ్యాలెన్స్ చెక్ చేయగా అదే మొత్తం కనిపించింది.

