PM MODI 18వ రోజ్‌గార్ మేళా 61వేల ప్రభుత్వ ఉద్యోగ పత్రాలు

January 24, 2026 6:08 PM

దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘రోజ్‌గార్ మేళా’ దిగ్విజయంగా కొనసాగుతోంది. శనివారం జరిగిన 18వ రోజ్‌గార్ మేళాలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 61,000 మందికి పైగా అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.

ఈ నియామక పత్రాలు కేవలం ఉద్యోగ పత్రాలు మాత్రమే కావని, ఇవి “దేశ నిర్మాణానికి ఆహ్వాన పత్రాలు” అని ప్రధాని అభివర్ణించారు.
కొత్తగా విధుల్లో చేరుతున్న యువత రాజ్యాంగం పట్ల తమ బాధ్యతను గుర్తుంచుకోవాలని, ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని PM MODI సూచించారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, పోస్టల్, రైల్వే, రక్షణ మరియు బ్యాంకింగ్ రంగాల్లో ఈ నియామకాలు జరిగాయి. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమని ఆయన నొక్కి చెప్పారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media