PM Modi: నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. బాలెన్‌షాకు ప్రధాని మోదీ ఫోన్

August 26, 2026 5:50 PM

నేపాల్‌కు పూర్తి సహాయం చేస్తామని మోదీ భరోసా

నేపాల్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉత్తర నేపాల్‌లో భారీ నష్టం జరిగింది.

రసువా జిల్లాలో పలు గ్రామాలు వరదల్లో కొట్టుకుపోయాయి. వంతెనలు ధ్వంసమయ్యాయి.

వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం. దాదాపు 6,000 మంది ఆచూకీ తెలియడం లేదని తెలుస్తోంది.

105 మంది భారతీయులు గల్లంతు

గల్లంతైన వారిలో 384 మంది టూరిస్టులు ఉన్నారు. వీరిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం.

మానస సరోవర్ యాత్రకు వెళ్లిన సుమారు 400 మంది కూడా గల్లంతయ్యారు. వారిలో 31 మంది భారతీయులు ఉన్నారు.

వరదల కారణంగా నేపాల్‌లో పరిస్థితులు తీవ్రంగా మారాయి.

ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు.

వరదల్లో ప్రాణనష్టం జరగడంపై సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్‌కు భారత్ అండగా ఉంటుందని చెప్పారు.

సహాయక సామాగ్రిని పంపిస్తామని భరోసా ఇచ్చారు. ఎయిర్‌ఫోర్స్ విమానాలతో పాటు C-130 రవాణా విమానాల్లో రిలీఫ్ మెటీరియల్‌ను పంపిస్తున్నారు.

ప్రధాని మోదీ ట్వీట్

ప్రధాని మోదీ ఎక్స్‌లో స్పందించారు. ‘‘నేపాల్‌లో వరదల కారణంగా సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను.

ఈ క్లిష్ట సమయంలో నేపాల్‌లోని మా సోదర సోదరీమణులకు భారతీయులందరూ అండగా నిలుస్తారు.

నేపాల్‌కు సాధ్యమైనంత మేర మానవతా దృక్పథంతో కూడిన సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది.

సహాయక, పునరావాస చర్యల విషయంలో మా బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి’’ అని మోదీ పేర్కొన్నారు.

నేపాల్-చైనా సరిహద్దులో భారీ నష్టం

నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో వరదల ప్రభావం ఎక్కువగా కనిపించింది.

రసువా సమీపంలో బోటే కోశీ నది ప్రమాద స్థాయిని దాటి ఉద్ధృతంగా ప్రవహించింది.

జనం ప్రాణభయంతో పరుగులు తీసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

భారీ భవనాలు, టూరిస్టుల వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి.

గీలోంగ్ పోర్ట్ ల్యాండ్ క్రాసింగ్ సమీపంలోని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. నాలుగు జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది.

12 హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్లు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి.

ప్లాంట్ల వద్ద పనిచేస్తున్న 15 మంది గల్లంతయ్యారు.

రసువాలో గల్లంతైన 384 మంది టూరిస్టుల్లో 311 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం.

రసువాతో పాటు నుసువా కోట్, దాదీడ్ జిల్లాలు కూడా వరదల ప్రభావానికి గురయ్యాయి.

12 హెలికాప్టర్లతో సహాయక చర్యలు

టిబెట్‌లో మంచు పర్వతాలు కరగడంతో ఆకస్మిక వరదలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

నేపాల్ సైన్యం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి.

కొత్తగా నిర్మించిన వంతెన కూడా వరదలకు ధ్వంసమైంది.

12 హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 8 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అత్యవసరంగా కేబినెట్ భేటీ

వరదల పరిస్థితిపై నేపాల్ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

సహాయక శిబిరాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

నేపాల్‌లో ఆకస్మిక వరదల నేపథ్యంలో భారత సరిహద్దు జిల్లాల్లో కూడా హైఅలర్ట్ ప్రకటించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media