తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.
హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ సదస్సు ‘తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్’ కు రావాలని ప్రధాని మోడీని సీఎం ప్రత్యేకంగా ఆహ్వానించారు.
విజన్ 2047 కేంద్రం లక్ష్యమైన ‘వికసిత్ భారత్ 2047’కు అనుగుణంగా, తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఈ విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి పనులకు కేంద్రం సహకారం అందించాలని కోరుతూ సీఎం వినతి పత్రాన్ని అందించారు.

రూ. 43,848 కోట్ల అంచనా వ్యయంతో 162.5 కి.మీ మేర చేపట్టనున్న హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ప్రాజెక్టును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ఆమోదించాలని కోరారు.
రీజనల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర భాగానికి ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలని, దక్షిణ భాగానికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్-అమరావతి-బందర్ పోర్ట్ (12 లేన్ గ్రీన్‌ఫీల్డ్), హైదరాబాద్-బెంగళూరు హై స్పీడ్ కారిడార్ నిర్మాణాలకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు.
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయ రవాణా కోసం టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూర్-శ్రీశైలం ఫోర్ లేన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు.
