నిమ్స్‌లో కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన పోచారం

January 28, 2026 4:42 PM

హైదరాబాద్ (నిమ్స్): విధి నిర్వహణలో గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు బుధవారం పరామర్శించారు. నిమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్న సౌమ్య ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బీరప్పను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్యులకు సూచించారు. సౌమ్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కలిసిన పోచారం గారు.. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, సౌమ్య త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లో చేరుతుందని ఆకాంక్షించారు.

నిజామాబాద్ మాధవనగర్ వద్ద గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో స్మగ్లర్లు కారుతో తొక్కించడంతో సౌమ్య తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆమె కిడ్నీ, లివర్ దెబ్బతినడంతో నిమ్స్ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.ఈ పర్యటనలో నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media