Polavaram Project పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి Nimmala Ramanaidu క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులతో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

మంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు ఆధునిక దేవాలయం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu సూచనల మేరకు గోదావరి పుష్కరాలకు ముందే ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 1372 మీటర్లలో ఇప్పటికే 1300 మీటర్లు పూర్తి అయ్యాయని మంత్రి వెల్లడించారు. అలాగే కుడి, ఎడమ కాలువల పనులను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.పోలవరం పూర్తి అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు గోదావరి జలాలు అందించి రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

