Gajuwakaలో పోలీసుల చొరవతో ఒక 10వ తరగతి విద్యార్థిని పరీక్ష రాసే అవకాశం పొందింది. హాల్టికెట్ ప్రకారం ఆమెకు Kanithi హైస్కూల్లో ఎగ్జామ్ సెంటర్ కేటాయించబడింది.
అయితే తల్లిదండ్రులు పొరపాటున ఆమెను గాజువాక పరీక్షా కేంద్రం వద్ద దించి వెళ్లిపోయారు. అక్కడ ఇన్విజిలేటర్ హాల్టికెట్ పరిశీలించి ఇది వేరే సెంటర్ అని చెప్పడంతో విద్యార్థిని బయటకు వచ్చి ఏడుస్తుండగా విధుల్లో ఉన్న పోలీసులు గుర్తించారు.పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు వెంటనే స్పందించి విద్యార్థినిని కనితి రోడ్డు హైస్కూల్ పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి సమయానికి పరీక్ష రాసేలా సహకరించారు.
