రక్షించాల్సిన పోలీస్ అధికారి దొంగతనానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ పోలీస్ శాఖను కుదిపేసింది. భోపాల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న కల్పన రఘువంశీ పై చోరీ కేసు నమోదైంది.
తన స్నేహితురాలి ఇంటి నుంచి రూ. 2 లక్షల నగదు, ఒక మొబైల్ ఫోన్ దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజీలో కల్పన ఇంట్లోకి రావడం, బయటకు వెళ్లడం, చేతిలో కరెన్సీ కట్ట పట్టుకుని ఉండడం స్పష్టంగా రికార్డయింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన తర్వాత ఆమె పరారీలో ఉండగా, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.పోలీస్ ఉన్నతాధికారులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి, కల్పనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక సీనియర్ అధికారి ఇలాంటి చర్యలకు పాల్పడడం శాఖ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చిందని వారు పేర్కొన్నారు.
