మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ శుక్రవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో మైనారిటీ ఓట్లను సమీకరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహం రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో మైనారిటీ ఓటర్లు ఉన్నారు.ఇప్పటికే పరోక్షంగా ఎంఐఎం (MIM) మద్దతు పొందిన కాంగ్రెస్, ఇప్పుడు మైనారిటీ వర్గానికి మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ వర్గంపై తన దృష్టిని మరింత బలపరిచింది. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారంతో మైనారిటీ వర్గం కాంగ్రెస్ వైపు మరింతగా ఆకర్షితమవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రివర్గంలో అజారుద్దీన్ కుచోటు – శుక్రవారం ప్రమాణ స్వీకారం
