పొన్నూరులో నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన MLA ధూళిపాళ్ల

March 12, 2026 4:07 PM

Ponnur ఆర్టీసీ డిపోలో నూతన బస్ సర్వీసులను Dhullipalla Narendra Kumar ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపోలో ఏర్పాటు చేసిన కొత్త స్కూటర్ స్టాండ్‌ను కూడా ఆయన ప్రారంభించారు.

తరువాత పచ్చలతాటిపర్రు గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు మరియు పట్టాదారు పాసుపుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రజల అభ్యర్థనల మేరకు పొన్నూరు–ఆరమండ మరియు గుంటూరు–నంబూరు బస్ సర్వీసులను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం ద్వారా గత ఏడు నెలల్లో పొన్నూరు డిపో ద్వారా సుమారు 26 లక్షల మంది మహిళలు రూ.7.30 కోట్ల మేర లబ్ధి పొందినట్లు ఆయన వెల్లడించారు. డిపో అభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కూటమి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media