గుంటూరు జిల్లా పొన్నూరులోని RTC డిపోలో రెండు కొత్త ఏసీ బస్సులను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రారంభించారు. అదనపు బస్సులు, కొత్త సర్వీసులు ప్రారంభమవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఎన్నో సంవత్సరాల తర్వాత కొత్త సర్వీసులు అందుబాటులోకి రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. గతంలో 2004–09 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో డిపో మూతపడే పరిస్థితి వచ్చినప్పుడు తీవ్రంగా పోరాడి మళ్లీ ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు. అప్పట్లో కేసులు ఎదుర్కొన్నప్పటికీ డిపోను కాపాడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.రాబోయే రోజుల్లో మరిన్ని సర్వీసులు తీసుకువచ్చి పట్టణ అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. అలాగే డిపోను ఆధునికీకరించేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని నారా చంద్రబాబు నాయుడిని కోరనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో RTC సిబ్బంది, టీడీపీ, జనసేన కార్యకర్తలు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
