సనాతన ధర్మం, హిందూ మనోభావాల పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు అవసరమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉంటే కొన్ని అరాచకాలను నియంత్రించవచ్చని చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ హిందూ సమాజానికి పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రమని పేర్కొంటూ, “తిరుపతి లడ్డూ కేవలం స్వీట్ కాదు, మన సామూహిక విశ్వాసానికి ప్రతీక” అని పవన్ కల్యాణ్ అన్నారు. ఏటా 2.5 కోట్ల మంది భక్తులు తిరుమల దర్శనానికి వస్తారని గుర్తుచేసి, “మా విశ్వాసానికి గౌరవం ఇవ్వడంలో రాజీ పడకూడదు” అని స్పష్టం చేశారు.
ఇదే అంశంపై నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, లడ్డూ వివాదంలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.
