మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తల సమస్యలను మంత్రి లోకేష్ ఆప్యాయంగా విన్నారు.
ప్రజలు, కార్యకర్తల వినతులను స్వీకరించి, సమస్యల పరిష్కారం కోసం సిబ్బందికి తక్షణమే ఆదేశాలు ఇచ్చారు. భరోసా: విజ్ఞప్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి, ప్రజలకు అండగా ఉంటామని మంత్రి లోకేష్ ప్రకటించారు.

