రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.
గురువారం సాయంత్రం తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించిన రాష్ట్రపతి, అనంతరం తిరుమలకు చేరుకుని పద్మావతి అతిథి గృహంలో బస చేశారు.
శుక్రవారం ఉదయం స్వామి పుష్కరిణి వద్ద శ్రీ వరాహ స్వామి దర్శనం అనంతరం, ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని అభివందించారు.
తర్వాత రాంభగీచా కాన్వాయ్ మార్గంగా తిరుమల నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి, అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

