సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఖైదీల పట్ల ఎటువంటి వివక్ష చూపరాదని అధికారులు స్పష్టం చేశారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ. కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ విజిటర్స్ ఫర్ ప్రిజనర్స్ బృందం శృంగవరపుకోట సబ్ జైల్ను సందర్శించి తనిఖీలు నిర్వహించింది.
ఈ సందర్భంగా ఖైదీలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించి పలు చట్టాలపై అవగాహన కల్పించారు. జైలు సిబ్బంది లేదా తోటి ఖైదీలు వివక్ష చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అదేవిధంగా జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును పరిశీలించి, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు నిర్వహిస్తున్న సేవలను సమీక్షించారు. ఖైదీలు నేరప్రవృత్తిని విడిచి మంచి పౌరులుగా మారాలని సూచించారు.
