ప్రొద్దుటూరులో వడ్డీ మాఫియా అరాచకం పేద మహిళలపై దోపిడీ

March 28, 2026 1:52 PM

Proddaturలో అక్రమ వడ్డీ వ్యాపారం తీవ్రంగా పెరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు గ్రూపులుగా చేర్చి అధిక వడ్డీతో అప్పులు ఇస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.

ఐదుగురు మహిళలతో గ్రూపులు ఏర్పాటు చేసి రూ.50,000 అప్పుగా ఇచ్చి, వారానికి ఒక్కొక్కరికి రూ.700 చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విధంగా 20 వారాల్లో భారీ మొత్తాన్ని వడ్డీ రూపంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం.అప్పు చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే బెదిరింపులు, దుర్భాషలతో వేధింపులకు గురిచేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లెక్కలు అడిగితే మళ్లీ అప్పు ఇవ్వమని బెదిరిస్తున్నారని కూడా పేర్కొన్నారు.పట్టణంలోని పెన్నా నగర్, ఈశ్వర్ రెడ్డి నగర్, అమృత నగర్ వంటి ప్రాంతాల్లో ఈ దందా ఎక్కువగా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి అక్రమ వడ్డీ వ్యాపారాన్ని అరికట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media