కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ అపార్ట్మెంట్ పైనుంచి కిందపడి ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. వైఎంఆర్ కాలనీలోని గురుసాయి అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది.

పొట్టిపాటి రామచంద్రారెడ్డి కుమార్తె చరిత. ఈమె స్థానిక కేశవరెడ్డి పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం అపార్ట్మెంట్ 5వ అంతస్తులో ఆడుకుంటున్న క్రమంలో చరిత అకస్మాత్తుగా అదుపుతప్పి కిందపడిపోయింది. తీవ్ర గాయాలపాలైన బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. చరిత తండ్రి రామచంద్రారెడ్డి పట్టణంలోని ఒక ఎరువుల దుకాణంలో పనిచేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో YMR కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. అపార్ట్మెంట్లలో పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది
