ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి సరికొత్త బాటలు వేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ కొనియాడారు. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు ప్రతి ప్రాంతానికి, సామాన్యుడి నుండి పారిశ్రామికవేత్త వరకు ప్రతి వర్గానికి లబ్ధి చేకూరేలా నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
రాజధాని అమరావతి అభివృద్ధికి ₹1,128.91 కోట్లు, ఇతర మౌలిక వసతులు, రహదారుల కోసం సుమారు ₹2,000 కోట్లకు పైగా కేటాయింపులు. సవరించిన అంచనాల ప్రకారం ₹3,320 కోట్లు కేటాయించి, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేలా కేంద్రం నిబద్ధత చాటుకుంది.APలో రేర్ ఎర్త్ (అరుదైన ఖనిజ) కారిడార్లకు ఆమోదం. ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా భారీ పెట్టుబడులు, 4,000 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు.రాష్ట్రంలోని 14.87 లక్షల LAKPATI దీదీలకు అండగా ఉండేందుకు ‘షీ-మార్ట్స్’ (She-Marts) ఏర్పాటు. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, చెన్నై–బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ల ద్వారా రాష్ట్ర రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు. అరకు, పులికాట్ పర్యాటక అభివృద్ధికి పెద్దపీట. కొబ్బరి, కోకో, జీడిమామిడి పంటలకు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించే ప్రత్యేక ప్యాకేజీ.
“విశాఖ ఏఐ హబ్ నుంచి ధర్మవరం మగ్గాల వరకు.. ఈ బడ్జెట్ ప్రతి ఇంటా వెలుగులు నింపుతుంది” అని మాధవ్ గారు స్పష్టం చేశారు.
