హర్రర్-ఫాంటసీ-కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది.నిహారిక కొణెదల నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన సారిక ప్రధాన పాత్రల్లో నటించారు.

సినిమా ప్రమోషన్లో భాగంగా రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ, ఇది కుటుంబంతో కలిసి చూసే వినోదభరితమైన సినిమా అని తెలిపారు.హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన సారిక కూడా సినిమా ఫాంటసీ, థ్రిల్లర్, కామెడీ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు.నటుడు గెటప్ శ్రీను మాట్లాడుతూ, ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
