ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కేకేఆర్. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరో సారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 30 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (25 బంతుల్లో 39), డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 28), అశుతోష్ శర్మ (11 బంతుల్లో 18 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో ఢిల్లీ స్కోరు 200 దాటింది. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్ తలా ఒక వికెట్ తీశారు. అయితే, కార్తీక్ త్యాగి 4 ఓవర్లలో 55 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక ఛేజింగ్ లో రహానే మెరుపులు తప్పా కేకేఆర్ జట్టులో చెప్పుకోదగ్గ బ్యాటింగ్ ఎవరూ చేయలేదు. 18.4 ఓవర్లలో కేకేఆర్ 163 పరుగులకు ఆలౌట్ అయి 40 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. రహానే 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేశారు. ఇంకే బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో కేకేఆర్ ఓటమితో 2026 ఐపీఎల్ టోర్నీని ముగించింది.

