నేడు విశాఖలో రాహుల్ గాంధీ DRDO ప్రాజెక్టులపై కమిటీ

January 20, 2026 2:50 PM

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఎంపీ రాధామోహన్ సింగ్ అధ్యక్షతన 9 మందితో కూడిన రక్షణ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా ఆయన ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.

మంగళవారం ఉదయం ఈ కమిటీ విశాఖలోని నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL)ను సందర్శిస్తుంది. అక్కడ డీఆర్డీవో (DRDO) చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, అత్యాధునిక రక్షణ సాంకేతికతపై శాస్త్రవేత్తలతో చర్చించనుంది. రేపు (బుధవారం) కోస్ట్‌గార్డ్ కార్యాలయాన్ని సందర్శించి, తీరప్రాంత రక్షణలో దాని పాత్ర, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కమిటీలో రాహుల్ గాంధీతో పాటు మాజీ సీఎం జగదీష్ శెట్టర్, మహమ్మద్ హనీఫా సభ్యులుగా ఉన్నారు. సోమవారం రాత్రి బెంగళూరు నుంచి విశాఖ చేరుకున్న కమిటీకి అధికారులు ఘన స్వాగతం పలికారు. చాల కాలం తర్వాత రాహుల్ గాంధీ ఏపీలో పర్యటిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media