రాయ్‌పూర్‌లో దారుణ ఘటన
ఛత్తీస్‌గఢ్‌లోని Raipur లో మైనర్ బాలికపై అత్యాచారం, పుట్టిన శిశువును విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
16 ఏళ్ల బాలికపై ఆమె తండ్రితో పాటు మరో ఐదుగురు వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
అబార్షన్ మాత్రలు ఇచ్చి.. మళ్లీ అత్యాచారం
బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బాలిక తన అత్తకు చెప్పింది.
దీంతో తండ్రి, అత్త కలిసి ఆమెపై దాడి చేసి బలవంతంగా అబార్షన్ మాత్రలు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
అనంతరం కూడా తండ్రి బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు కేసు దర్యాప్తులో తేలింది. దీంతో ఆమె మరోసారి గర్భం దాల్చింది.
ఆధార్ కార్డు ఫోర్జరీ.. ఆసుపత్రిలో ప్రసవం
బాలిక వయస్సును పెంచి మేజర్‌గా చూపించేందుకు నిందితులు ఆమె ఆధార్ కార్డును ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఆమెకు పెళ్లయినట్లు చూపిస్తూ తప్పుడు ధ్రువపత్రాలు కూడా సృష్టించారు.
ఆ తర్వాత రాయ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో బాలికను చేర్పించారు. అక్కడ సిజేరియన్ ద్వారా ఆమెకు మగబిడ్డ పుట్టింది.
పుట్టిన వెంటనే ఆ పసికందును మరో వ్యక్తికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంలో ఆసుపత్రి వైద్యుడితో పాటు బాలిక తండ్రి, ఇతర వ్యక్తులు కూడా భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు.
ఆరుగురు అరెస్ట్
బాధితురాలి ఫిర్యాదు మేరకు న్యూ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పొక్సో యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
బాలిక తండ్రితో సహా మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.



