Nandyal districtలోని Dhone మండలం కొత్తబురుజులో నిర్వహించిన “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమంలో N. Chandrababu Naidu పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను ఉచితంగా అందజేశారు.

2027 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని భూ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం తెలిపారు. భూ రికార్డులు తారుమారు కాకుండా క్యూఆర్ కోడ్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నామని చెప్పారు.గత ప్రభుత్వంలో భూ రికార్డులు తారుమారు చేసి సమస్యలు సృష్టించారని విమర్శించిన సీఎం, ఇప్పుడు రైతుల సమక్షంలో భూమి కొలతలు తీసుకుని వివాదాలు లేని పట్టాదార్ పాస్ పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు.రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

