రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ కొత్త విడుదల తేదీని ప్రకటించింది.

గతంలో ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జానవీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లో 16వ చిత్రంగా (RC16) తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన ఒక స్పోర్ట్స్ కోచ్‌గా కనిపించనున్నారు.
