నెలవంక దర్శనం.. ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం

February 20, 2026 12:33 PM

ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ (Ramadan) మాసం ప్రారంభమైంది. ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో ‘రుహియత్ ఎ హిలాల్ కమిటీ’ మాసారంభాన్ని ప్రకటించింది. దీంతో ముస్లింలు నేటి తెల్లవారుజామున ‘సహర్’ ముగించుకుని తొలి ఉపవాసాన్ని (రోజా) ప్రారంభించారు.

రంజాన్ అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు, క్రమశిక్షణ, దానగుణం మరియు మనశ్శుద్ధికి ఇస్లాం ఇచ్చే గొప్ప శిక్షణ. సమాజంలో ఆర్థిక సమానత్వం కోసం పేదలకు దానధర్మాలు చేసే ‘జకాత్’ ప్రక్రియ ఈ మాసంలో ముమ్మరంగా జరుగుతుంది. మసీదులు విద్యుత్ కాంతులతో అలంకరించబడ్డాయి. రాత్రిపూట నిర్వహించే ప్రత్యేక తరావీ నమాజ్‌లకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. భాగ్యనగరంలో రంజాన్ సందడి మొదలైంది. చార్మినార్, మక్కా మసీదు పరిసరాల్లో హలీం ఘుమఘుమలు, ఇఫ్తార్ విందుల సందడి నెలకొంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media