భూమి వివాదంపై తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించిన రైతులు

March 9, 2026 5:48 PM

Rapur మండలం ఆంజనేయపురం STవాసులు తమ సాగులో ఉన్న భూమిపై కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సోమవారం Nellore districtలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మీనరసింహంకు వినతి పత్రం సమర్పించారు.

1142/5A సర్వే నంబర్‌లో ఉన్న భూమిని గత 30 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని బాధితులు తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు ఆ భూమిని అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భూమిని అమ్మలేదని, కేవలం లీజుకు ఇచ్చామని స్పష్టం చేశారు.ఈ విషయంపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని తహసీల్దార్‌ను వారు కోరారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media