TG:విద్యార్థినికి ఉద్యోగం చూపించి పేద కుటుంబ రేషన్ కార్డు రద్దు

March 31, 2026 1:16 PM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హులైన పేద కుటుంబానికి రేషన్ కార్డు రద్దు చేసిన ఘటన వెలుగుచూసింది. పట్టణానికి చెందిన బొడ్డుపల్లి మల్లేశ్ చౌకధర దుకాణానికి వెళ్లగా తన రేషన్ కార్డు రద్దైనట్లు డీలర్ తెలిపాడు.

దీంతో మీసేవ కేంద్రంలో విచారించగా, ప్రభుత్వ రికార్డుల్లో అతని కుమార్తెకు ఆర్టీసీలో ఉద్యోగం ఉన్నట్లు నమోదు చేసి కార్డు తొలగించినట్లు తెలిసింది. అయితే ఆమె ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నదని బాధితుడు తెలిపాడు.అధికారుల తప్పిదం వల్ల రేషన్ కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన మల్లేశ్, వాస్తవాలను పరిశీలించి తమ రేషన్ కార్డును పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరాడు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media