లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు RBI చెక్

May 22, 2026 4:11 PM

తెలిసో తెలియకో మనలో చాలామంది అవసరాల కోసం బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకుంటూ ఉంటాం. కానీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి సకాలంలో ఈఎంఐ కట్టకపోతే చాలు.. బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ నుంచి వచ్చే హరాస్మెంట్, థ్రెట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంటగంటకూ ఫోన్ కాల్స్ చేయడం, నోటికొచ్చినట్లు మాట్లాడటం, బెదిరించడం.. ఇలా కస్టమర్స్‌కు నరకం చూపించే ఘటనలు చాలానే చూశాం. కొందరు అయితే ఈ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇప్పటివరకు ఈ విషయంపై బ్యాంక్స్‌ను ప్రశ్నిస్తే.. “ఆ ఏజెంట్స్ మా ఎంప్లాయీస్ కారు” అంటూ సింపుల్‌గా తప్పించుకునేవి. కానీ ఇకపై అలాంటి గేమ్స్ సాగవు. కస్టమర్స్‌ను వేధించే రికవరీ ఏజెంట్స్ చేసే తప్పులకు ఇకపై సంబంధిత బ్యాంక్స్, ఫైనాన్స్ కంపెనీస్‌నే పూర్తి రెస్పాన్సిబిలిటీ వహించాల్సి ఉంటుంది. ఈ హరాస్మెంట్‌కు చెక్ పెట్టేందుకు ఆర్‌బీఐ కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ఈ అక్టోబర్ 1 నుంచే ఈ రూల్స్ ఇంప్లిమెంట్ అవుతాయి.

అయితే.. ఆర్‌బీఐ తీసుకొస్తున్న ఈ కొత్త రూల్స్ కేవలం పర్సనల్ లోన్స్‌కే కాదు.. ఈ మధ్య ఈఎంఐలలో కొనుగోలు చేస్తున్న ఖరీదైన స్మార్ట్‌ఫోన్స్‌కూ వర్తిస్తాయి. ముఖ్యంగా ఐఫోన్స్, బ్రాండెడ్ మొబైల్స్‌ను ఈఎంఐలపై కొనేవారి నంబర్ భారీగా పెరిగింది. ఒకవేళ మీరు మొబైల్ లోన్ ఈఎంఐలు పేయ్ చేయకుండా చాలా రోజులు పెండింగ్‌లో ఉంచితే.. ఏజెంట్స్ మీ ఇంటికి వచ్చి హరాస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఫైనాన్స్ కంపెనీస్ మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేసేయగలవు. అంటే ఫోన్ పూర్తిగా పనిచేయకుండా బ్లాక్ అవుతుంది.

కానీ ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈఎంఐ డ్యూ డేట్ దాటిన వెంటనే ఫోన్‌ను లాక్ చేయరు. ముందుగా కస్టమర్స్‌కు 90 డేస్ టైమ్ ఇస్తారు. అలాగే రెండు సార్లు నోటీసెస్ కూడా పంపిస్తారు. ఆ తర్వాత కూడా పేమెంట్ చేయకపోతేనే ఫోన్ బ్లాక్ అవుతుంది. ఇంకో ఇంటరెస్టింగ్ రూల్ ఏంటంటే.. ఫోన్ బ్లాక్ అయినా మీ పర్సనల్ డేటా మాత్రం పూర్తిగా సేఫ్‌గా ఉంటుంది. ఫైనాన్స్ కంపెనీస్ మీ ఫోటోస్, వీడియోస్, పర్సనల్ ఫైల్స్ లేదా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్‌ను యాక్సెస్ చేయలేవు. అలాగే ఇంటర్నెట్ సర్వీసెస్, ఇన్‌కమింగ్ కాల్స్, ఎమర్జెన్సీ అలర్ట్స్ కూడా ఎప్పటిలాగే వర్క్ అవుతాయి.

ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ రూల్ కూడా ఉంది. మీరు పెండింగ్‌లో ఉన్న లోన్ అమౌంట్ పూర్తిగా క్లియర్ చేసిన తర్వాత.. కేవలం వన్ అవర్‌లోనే మీ ఫోన్‌ను మళ్లీ అన్‌లాక్ చేయాలి. ఒకవేళ కంపెనీ గంటలోపు అన్‌లాక్ చేయకపోతే.. కస్టమర్స్‌కు గంటకు ₹250 చొప్పున కంపన్సేషన్ చెల్లించాలి. మొత్తానికి లోన్ రికవరీ విషయంలో ఆర్‌బీఐ తీసుకొస్తున్న ఈ కొత్త చేంజెస్ కస్టమర్స్‌కు పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media