రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది కూడా అదరగొడుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ లక్ష్యాన్ని ఛేదించింది. కోల్ కతా నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు బ్యాటర్లు కోహ్లి(105నాటౌట్) సెంచరీకి తోడు పడిక్కల్ (39) రాణించారు. దీంతో బెంగళూరు 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. కోల్ కతా బౌలర్లు కార్తీక్ త్యాగీకి మూడు, నరైన్ ఒక వికెట్ పడగొట్టారు.
కోల్ కతా బ్యాటర్ రఘువంశీ అర్ధ శతకంతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రఘువంశీ అర్ధ శతకానికి తోడు గ్రీన్(32), రింకు సింగ్(49నాటౌట్) బ్యాటింగ్ లో రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లికి దక్కింది. భారీ వర్షం కారణంగా నిర్ణీత సమయానికి ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గంటన్నర ఆలస్యంగా వేశారు. అయితే, ఓవర్ల కుదింపు ఏమీ లేకుండానే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ గెలుపుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది.
