ఆర్డీటీ సంస్థకు FCRA రీన్యూవల్ లభించడంతో ఫెర్రర్ కుటుంబం మరియు పరిటాల కుటుంబం మధ్య ఆత్మీయ భేటీ జరిగింది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ అనంతపురంలో ఫెర్రర్ కుటుంబాన్ని కలిశారు.

ఈ సందర్భంగా అన్నే ఫెర్రర్, విశాల ఫెర్రర్ వారిని ఆహ్వానించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. FCRA రీన్యూవల్ ఆలస్యంతో సేవా కార్యక్రమాలు నిలిచిపోతాయనే ఆందోళన ఉన్నప్పటికీ, కేంద్రం నుంచి అనుమతి రావడంతో అందరిలో ఆనందం నెలకొంది.ఈ రీన్యూవల్ సాధనలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చొరవ కీలకమని వారు పేర్కొన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు.ఆర్డీటీ సంస్థ గత దశాబ్దాలుగా అందిస్తున్న సేవలు అమూల్యమని పరిటాల సునీత, శ్రీరామ్ పేర్కొంటూ, భవిష్యత్తులో ఈ సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
