22A భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

August 19, 2026 10:51 AM
Revanth Reddy reviewing the 22A land issue with officials

ప్రైవేటు భూముల యజమానులకు ఇబ్బందులు రానివ్వం

Telangana: 22A భూముల వ్యవహారంపై తెలంగాణ CM Revanth Reddy కీలక ప్రకటన చేశారు. ప్రైవేటు భూముల యజమానులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమని స్పష్టం చేశారు. ప్రజల ఆస్తి హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

22A జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వారి ఆస్తులను రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో పరిశీలిస్తారని సీఎం తెలిపారు.

ప్రైవేటు భూమి అని తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

22A భూములపై అధికారులతో సమీక్ష

22A భూముల అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటితో పాటు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రైవేటు భూముల విషయంలో ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వబోమని సీఎం భరోసా ఇచ్చారు.

ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

రెండు రోజుల్లో పరిశీలన

రిజిస్ట్రేషన్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకున్న వారి ఆస్తులు 22A జాబితాలో ఉంటే.. రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో పరిశీలిస్తారని రేవంత్‌రెడ్డి చెప్పారు.

అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేషన్ వెంటనే చేస్తారని తెలిపారు.

జిల్లా కలెక్టర్లు 22A జాబితాలో ఉన్న భూములను క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు. శాశ్వత పరిష్కారం కోసం సరైన జాబితాను రూపొందించాలని సూచించారు.

జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

వదంతులను నమ్మొద్దు.. దళారులను ఆశ్రయించొద్దు

22A భూముల విషయంలో ప్రజలు వదంతులు, కట్టుకథలను నమ్మొద్దని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని చెప్పారు.

భూ హక్కుల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు.

ప్రైవేటు భూముల యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media