తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్ర స్థాయిలో స్పందించింది.
మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పై అవమానకరమైన భాష ఉపయోగించారని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి వైఖరిపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి పదవికి తగిన గౌరవాన్ని కాపాడకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు.రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన సమయంలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని బీఆర్ఎస్ అభిప్రాయపడింది. తెలంగాణకు బాధ్యతాయుతమైన నాయకత్వం అవసరమని, రాజకీయ నాయకులు సంయమనంతో వ్యవహరించాలని సూచించింది.ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
