కేంద్రం వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

August 24, 2026 5:56 PM
CM Revanth Reddy speaking about US tour permission issue

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై రేవంత్ ఫైర్

Telangana: అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై తెలంగాణ Revanth Reddy రెడ్డి తీవ్రంగా స్పందించారు. యూకే పర్యటనకు అనుమతి ఇచ్చి.. అమెరికా పర్యటనకు మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. తన విదేశీ పర్యటనను కేంద్రం కావాలనే అడ్డుకుందని ఆరోపించారు.

తెలంగాణ అభివృద్ధిని ఆపలేరు

వికసిత్‌ భారత్‌ లక్ష్యంతో కేంద్రం పనిచేస్తుంటే.. తెలంగాణ రైజింగ్‌ విజన్‌తో తాము ముందుకెళ్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.

రాష్ట్రాల కలయికతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. విదేశీ పర్యటనల ద్వారా తెలంగాణకు పెట్టుబడులు, విద్య, క్రీడల రంగాల్లో అవకాశాలు తీసుకురావాలని భావించామని వివరించారు.

అయితే ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతి ఇచ్చి.. అమెరికా పర్యటనకు నిరాకరించడంలో కేంద్రం ఉద్దేశమేంటని ప్రశ్నించారు.

కేంద్రం వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. తన పర్యటనను అడ్డుకున్నా.. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాన్ని మాత్రం ఆపలేరని స్పష్టం చేశారు.

యూఎస్‌కు అధికారులను పంపామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌తో ఒప్పందం జరుగుతుందని చెప్పారు. తన పర్యటనలో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేశారు.

విదేశాంగశాఖ మాత్రం దాపరికం ఉన్నట్టుగా మాట్లాడిందని మండిపడ్డారు.

బీజేపీ ఎంపీలపై రేవంత్ ప్రశ్నలు

బీజేపీ నేతలు విచక్షణ కోల్పోయి అవాస్తవాలను ప్రచారం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉండగా స్పందిస్తే తనను దేశద్రోహి అంటారని.. అందుకే భారత్‌కు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పారు.

గుజరాత్ సీఎం విదేశీ పర్యటనలకు అనుమతిచ్చి.. తెలంగాణ సీఎంకు అనుమతి ఇవ్వకపోవడం అవమానకరమని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అవమానమని అభిప్రాయపడ్డారు. గుజరాత్ ఆధిపత్యానికి ఇదే నిదర్శనమని విమర్శించారు.

తెలంగాణ బీజేపీ ఎంపీలకు రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వారు గుజరాత్‌కు మద్దతు ఇస్తున్నారా అని నిలదీశారు. కేంద్రం నిర్ణయం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమేనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media