రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని కొత్త పాట ‘చికిరి చికిరి’పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు.
ఎక్స్‌లో పోస్ట్ చేసిన వర్మ, “సినిమాలోని ప్రతి క్రాఫ్ట్ — దర్శకత్వం, సంగీతం, సినిమాటోగ్రఫీ — హీరోని ఎలివేట్ చేయడానికే. చాలా రోజుల తర్వాత రామ్ చరణ్‌ను ఇంత రా, రియల్ ఫార్మ్‌లో చూశా,” అన్నారు.
“The true purpose of every cinematic craft — direction, music, cinematography — is to elevate the hero. After a long time, I saw Ram Charan in his most raw and explosive form in the #Peddi song.”
He added, “Kudos to Buchi Babu for realizing that a star shines brightest when not buried under heavy sets or extra glitter, but when the camera focuses purely on him.”
“భారీ సెట్‌లు, అదనపు బ్లింగ్ అవసరం లేకుండానే స్టార్ మెరుస్తాడు అని అర్థం చేసుకున్నందుకు బుచ్చిబాబు నీకు శభాష్,” అని వర్మ ప్రశంసించారు.
దానికి బుచ్చిబాబు స్పందిస్తూ, “మీ మాటలు నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి సర్. పెద్ద సినిమాల్లో స్టార్ మెరవడం అత్యంత ముఖ్యం,” అని పేర్కొన్నారు.
ఏ.ఆర్. రహ్మాన్ స్వరపరిచిన ఈ పాటలో మోహిత్ చౌహాన్ గానం, బాలాజీ సాహిత్యం ఆకట్టుకుంటున్నాయి. రామ్ చరణ్ తన ప్రత్యేకమైన డ్యాన్స్ స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
దర్శకుడు బుచ్చిబాబు ప్రకారం, “చికిరి” అంటే మేకప్ లేకుండా సహజసిద్ధంగా అందంగా కనిపించే అమ్మాయిని సూచించే స్థానిక పదమని తెలిపారు.

