ఆంధ్ర యూనివర్సిటీలో శాంతియుతంగా RSS శాఖ నిర్వహిస్తున్న స్వయం సేవకులపై వామపక్ష విద్యార్థి సంఘాలు దాడి చేయడం అమానుషమని బీజేపీ సీనియర్ నేత మిడతల రమేష్ మండిపడ్డారు. గురువారం పొదలకూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏఐఎస్ఎఫ్ (AISF), ఎస్ఎఫ్ఐ (SFI) ముసుగులో ఉన్న వామపక్ష గుండాలు ఈ దాడికి పాల్పడటం సిగ్గుచేటని విమర్శించారు.
భరతమాతను కీర్తిస్తూ ప్రార్థన చేసుకుంటున్న వారిపై దాడి చేయడం అంటే భారతీయుల ఆత్మపై దాడి చేయడమేనని రమేష్ అభివర్ణించారు. భారతదేశ జీవన విధానానికి ఏమాత్రం సంబంధం లేని విదేశీ సిద్ధాంతాలతో వామపక్షాలు దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రార్థన వినడానికి ఇష్టపడని వారు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపాలి తప్ప, దాడులకు దిగడం వారి అరాచకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చింతగింజల సుబ్రమణ్యం, రాచపూడి ధనుంజయ రావు, వేణుగోపాల్ తదితరులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.
