అవన్నీ మార్ఫింగ్.. ఫిర్యాదు చేస్తున్నా: రుక్మిణి వసంత్

May 23, 2026 12:36 PM
Rukmini Vasanth Clarity

రుక్మిణి వసంత్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ సరసన ‘డ్రాగన్’, రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తోంది. ఇంతలో ఆమె గ్రీన్ కలర్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్‌లోకి దిగుతున్న వీడియో క్లిప్స్, ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఈ విజువల్స్‌లో ఆమె చుట్టూ ప్రొఫెషనల్ కెమెరామెన్లు, లైటింగ్ సిబ్బంది ఉన్నారు.

ఈ వైరల్ కంటెంట్‌పై ఇప్పటివరకు నటి రుక్మిణి వసంత్ స్పందించింది. ఆన్‌లైన్‌లో ప్రచారం అవుతున్న కొన్ని AI ద్వారా సృష్టించిన చిత్రాలను తమ బృందం గమనించిందని తెలిపింది. ఈ చిత్రాలు పూర్తిగా నకిలీవి, కల్పితమైనవని స్పష్టంగా చెప్పదలచుకున్నాను. ఇలాంటి ఎడిట్ చేసిన కంటెంట్‌ను సృష్టించడం, ప్రచారం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని స్పష్టం చేసింది రుక్మిణి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము, ఈ చిత్రాలను సృష్టించి, వ్యాప్తి చేయడంలో పాలుపడిన వారిపై అవసరమైన చట్టపరమైన మరియు సైబర్‌క్రైమ్ చర్యలను ప్రారంభిస్తున్నట్లు హెచ్చరించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media