ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల ఆహార భద్రత కోసం చేపట్టిన అన్న క్యాంటీన్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం ఉన్న 207 క్యాంటీన్లకు తోడు మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లను ప్రారంభించనుంది. దీంతో మొత్తం క్యాంటీన్ల సంఖ్య 269కు చేరుకోనుంది.
ప్రభుత్వం రూ.5కే నాణ్యమైన, శుచిగా భోజనం అందిస్తూ ప్రతిరోజూ సుమారు 2.10 లక్షల మందికి సేవలు అందిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8.80 కోట్ల భోజనాలు అందించగా, ఈ పథకానికి ప్రభుత్వం రూ.243 కోట్ల సబ్సిడీ ఖర్చు చేసింది.కొత్తగా ఏర్పాటు చేసే గ్రామీణ అన్న క్యాంటీన్ల కోసం సంవత్సరానికి సుమారు రూ.58 కోట్లు ఖర్చు చేయనుంది.ఈ నెల 15న ధరణికోటలో కొత్త అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి భోజనం చేయనున్నారు.కార్మికులు, కూలీలు మరియు పట్టణాలకు వచ్చే గ్రామీణ ప్రజలు ఆకలితో ఉండకుండా చేయడం లక్ష్యంగా ఈ సేవలను విస్తరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

