శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఉందని ప్రశ్నించిన ఒక తెలుగు అయ్యప్ప భక్తుడిపై స్థానిక షాపు యజమాని గాజు సీసాతో దాడి చేయడంతో భక్తుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
వాటర్ బాటిల్ ధర విషయంలో ఓ తెలుగు అయ్యప్ప భక్తుడికి, స్థానిక వ్యాపారికి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన షాపు యజమాని భక్తుడి తలపై గాజు సీసాతో కొట్టడంతో తల పగిలింది.

దాడి విషయం తెలుసుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున షాపు వద్దకు చేరుకున్నారు.
భక్తులు షాపు వద్ద నిల్చొని నిరసన తెలుపుతుండటంతో, పోలీసులు రంగంలోకి దిగి వ్యాపారులను, భక్తులను అడ్డుకుంటున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
