సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీకి చెందిన ఎథెనా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ఆయనపై ₹14 కోట్ల మోసం చేసినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సంస్థ ఆరోపణల ప్రకారం, శ్రీధర్ రావు నకిలీ పత్రాలు సృష్టించి తమను నమ్మించి భారీగా మోసం చేశారని, ఈ వ్యవహారంలో ఆయన భార్య కూడా భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు.ఈ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు శ్రీధర్ రావు మరియు ఆయన భార్యపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ కేసు ప్రస్తుతం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
