ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ వ్యసనం మరో ప్రాణాన్ని బలిగొన్నది. సంగారెడ్డి జిల్లా మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై యువ కానిస్టేబుల్ కొటారి సందీప్ కుమార్ (25) తన వద్ద ఉన్న రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కల్హేర్ మండలానికి చెందిన సందీప్ సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. 2024 బ్యాచ్‌కు చెందిన ఆయన కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు మరియు గేమ్స్‌కు బానిసై, వాటి కోసం బంధువులు, స్నేహితుల వద్ద లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
ఆత్మహత్యకు ముందు ‘వెల్ విషర్స్’ పేరుతో వాట్సాప్ గ్రూప్ సృష్టించి, “అమ్మా, చెల్లీ నన్ను క్షమించండి… నేను మీకు బాధ మాత్రమే ఇచ్చాను” అంటూ సూసైడ్ నోట్ పంపించాడు. తండ్రి పదిహేనేళ్ల క్రితం మరణించగా, అతడికి తల్లి, చెల్లి ఉన్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
