ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం వినూత్నమైన ‘కారవాన్ టూరిజం’ (Caravan Tourism) ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు, వీఐపీలు మాత్రమే వాడే కారవాన్ వాహనాలు ఇప్పుడు సామాన్య పర్యాటకులకు కూడా విలాసవంతమైన అనుభూతిని అందించనున్నాయి. ఈ వాహనాల్లో ఏసీ, టీవీ, ఫ్రిజ్, మైక్రోవేవ్ ఓవెన్, వాష్‌రూమ్ మరియు రాత్రి వేళ నిద్రించడానికి వీలుగా పడకలుగా మారే సీట్లు ఉన్నాయి.
హైదరాబాద్ నుంచి భీమవరం, దిండి వరకు 6 రోజుల ప్యాకేజీని రూ. 3.50 లక్షలకు అందిస్తున్నారు. ఇది జనవరి 10, 11, 12 తేదీల్లో బుక్ చేసుకునే వారికి అందుబాటులో ఉంటుంది.
వైజాగ్ – అరకు, లంబసింగి (1.5 రోజులు): ₹31,500 – ₹42,500
వైజాగ్ – పంచారామాలు (1.5 రోజులు): ₹31,500 – ₹42,500
హైదరాబాద్ – గండికోట (2 రోజులు): ₹64,000 – ₹85,000
హైదరాబాద్ – సూర్యలంక (2 రోజులు): ₹64,000 – ₹85,000
ఆసక్తి గల పర్యాటకులు నేరుగా APTDC అధికారిక పోర్టల్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు.
