భారత్ Defenceలో ‘Sarvam AI’తో భారీ Upgrade..

April 22, 2026 3:04 PM

భారత్ డిఫెన్స్ రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ‘Sarvam’ వంటి స్వదేశీ AI ల్యాబ్స్, రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి సుమారు ₹300 కోట్లతో Centre of Excellence ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం విదేశీ AIపై ఆధారపడకుండా స్వదేశీ టెక్నాలజీని బలోపేతం చేయడం.

ఈ క్రమంలో ‘Sarvam AI’ భారత సైన్యానికి కీలకంగా మారనుంది. సరిహద్దుల్లో రియల్‌టైమ్ సర్వైలెన్స్ ద్వారా అనుమానాస్పద కదలికలను గుర్తించడం, శత్రు చర్యలను ముందుగానే అంచనా వేయడం, యుద్ధ పరిస్థితుల్లో వేగవంతమైన నిర్ణయాలకు సహకరించడం వంటి అంశాల్లో ఇది ఉపయోగపడనుంది. ముఖ్యంగా భారత భౌగోళిక పరిస్థితులు, వాతావరణానికి అనుగుణంగా ట్రైనింగ్ పొందడం వల్ల దీని ఖచ్చితత్వం మరింత పెరుగుతుంది.ఇప్పటికే ఉక్రెయిన్, ఇరాన్ వంటి యుద్ధాల్లో AI కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, భారత్ కూడా స్వంత AI సామర్థ్యాలతో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ముందడుగు వేస్తోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media