AP:సత్తెనపల్లి జనసేన కౌన్సిలర్‌పై చర్యల డిమాండ్

March 28, 2026 11:35 AM

Sattenapalliలో జనసేన కౌన్సిలర్‌పై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు స్వాతిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ, జనసేన కౌన్సిలర్ సుమన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో తాలూకా సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media