జంతువు అవయవాన్ని మనిషికి అమర్చే జెనోట్రాన్స్‌ప్లాంట్ వైద్య చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. అమెరికా బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు పంది కిడ్నీని అమర్చిన వ్యక్తి 271 రోజుల పాటు విజయవంతంగా జీవించాడు.న్యూ హాంప్‌షైర్‌కు చెందిన టిమ్ అండ్రూస్ (67) డయాబెటిస్ కారణంగా రెండు కిడ్నీలు పనితీరు కోల్పోయారు. సరిపోయే దాత దొరకకపోవడంతో వైద్యులు ఇజెనిసిస్ కంపెనీ రూపొందించిన జన్యుమార్పిడి పంది కిడ్నీని 2025 జనవరి 25న ఆయనకు అమర్చారు.ఈ కిడ్నీ అండ్రూస్ శరీరంలో సజావుగా పనిచేసి, ఆయనకు డయాలసిస్ అవసరం లేకుండా చేసింది. అయితే తాజాగా కిడ్నీ పనితీరు తగ్గడంతో వైద్యులు దానిని తొలగించారు.అమెరికాలో పంది కిడ్నీ అమర్చిన వారిలో అండ్రూస్ ఇప్పటివరకు అత్యధిక కాలం – 271 రోజులు జీవించి వైద్య చరిత్ర సృష్టించారు. ఈ విజయం జెనోట్రాన్స్‌ప్లాంట్ పరిశోధనలకు కీలక ముందడుగు అని నిపుణులు పేర్కొన్నారు.
Science:జెనోట్రాన్స్‌ప్లాంట్‌లో నూతన రికార్డు – పంది కిడ్నీతో 271 రోజులు జీవించిన అమెరికన్ వ్యక్తి
