Secunderabadలోని పద్మారావు నగర్లో థాంకోస్ నాచురల్ ఐస్ క్రీమ్స్ అండ్ కేఫ్ ను Talakani Srinivas Yadav ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో పార్లర్‌ను ప్రారంభించిన ఆయన అక్కడ అందుబాటులో ఉన్న ఐస్ క్రీమ్‌లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలంలో చల్లని పానీయాలు, ఐస్ క్రీమ్‌లకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారని చెప్పారు. నాణ్యమైన పదార్థాలతో తయారైన ఐస్ క్రీమ్‌లు పిల్లలు, పెద్దలకు ఇష్టమని, ఈ పార్లర్ మంచి విజయాన్ని సాధించాలని నిర్వాహకులను ఆశీర్వదించారు.పార్లర్ యజమాని నిఖిల్ మాట్లాడుతూ నాచురల్ ఫ్లేవర్స్‌తో తయారైన పలు రకాల ఐస్ క్రీమ్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి నెలలో 50% డిస్కౌంట్ అందిస్తామని చెప్పారు.
