కేసీఆర్.. రైతుబంధుకు ఆరోనెలల సమయం పట్టలేదా?: మంత్రి సీతక్క నిలదీత

April 21, 2026 8:18 PM

హైదరాబాద్: రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ తన పదేళ్ల పాలనలో రైతులను ఎలా ఇబ్బంది పెట్టారో గణాంకాలతో సహా ఆమె వివరించారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతుబంధును నెలల తరబడి సాగదీసి ఇచ్చిందని, కేసీఆర్ అబద్ధాలను మహిళా లోకం గమనిస్తోందని హెచ్చరించారు.

రైతుబంధును ఒకేరోజు వేసేవాడిని అని కేసీఆర్ చెప్పుకోవడం హాస్యాస్పదమని సీతక్క ఎద్దేవా చేశారు. “కేసీఆర్ హయాంలో రైతుబంధు నిధులు ఏనాడూ ఒక్క రోజులో అందలేదు. ఒక్కసారి తేదీలు చెక్ చేసుకోవాలి” అని సూచించారు. నిధుల పంపిణీకి 161 రోజులు పట్టింది. అంటే పంట పండించే కాలం కంటే చెల్లింపులకే ఎక్కువ సమయం తీసుకున్నారు. 2022-23 యాసంగిలో: 148 రోజులు (5 నెలలు) సాగదీశారు. కాంగ్రెస్ హయాంలో …. గత వానాకాలం కేవలం 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆమె స్పష్టం చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట నిజమని, అయినప్పటికీ ఎక్కడా సంక్షేమం ఆగకుండా తాము వెసులుబాటు కల్పిస్తున్నామని సీతక్క పేర్కొన్నారు. ఏకకాలంలో రుణమాఫీని అమలు చేసిన ఘనత తమదేనని, ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని ఆమె గుర్తు చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media