విచారణకు రావాల్సిందే.. బండి భగీరథ్

May 12, 2026 8:17 PM

కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణలతో అతనిపై పోక్సో కేసు నమోదైంది. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు పంపించింది. మధ్యాహ్నం రెండు గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. బండి భగీరథ్ కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో కేసు విచారణ పారదర్శకంగా జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని ఇటీవల ఆదేశించారు. ఈ కేసు సిట్ విచారిస్తోంది. బండి భగీరథ్‌‍పై బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

మరో వైపు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో త‌న‌పై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ బండి భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు. పిటిషన్‌పై ఈనెల 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపే అవకాశం ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media