CI నాగారాజు అరెస్ట్.!

June 23, 2026 3:29 PM
SIT officials arrest suspended CI Nagaraju in Singhnagar.

అరెస్ట్‌ను అడ్డుకునేందుకు మద్దతుదార్లు, స్థానికుల ఆందోళన.. భారీగా భద్రత ఏర్పాటు

SIT బృందం ఉదయం నివాసానికి చేరుకుని అదుపులోకి తీసుకున్న అధికారులు

AP: ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా సాయికృష్ణ మిస్సింగ్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజును తాజాగా SIT అధికారులు అరెస్ట్ చేశారు.

ఉదయం సింగ్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న సిట్ బృందం నాగరాజును అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.

అయితే ఆయన్న అరెస్ట్ చేసే సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణ చోటు చేసుకుంది.
సీఐ నాగరాజును అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను నాగరాజు మద్దతుదార్లులు, స్థానికులు అడ్డుకున్నారు. ఆయన్న అరెస్ట్ చేయవద్దంటూ ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ పోలీసులకు అడ్డుతగిలారు.

దీంతో పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టి నాగరాజు ఇంట్లోకి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే నాగరాజు ఇంటికి స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ముందు జాగ్రత్తగా ఆ ఏరియాలో సెక్యూరిటీని కూడా పెంచారు .

సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో తల్లి చేసిన ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media